తెలంగాణ బీజేపీ చీఫ్ టీమ్ రెడీ.. లిస్ట్ విడుద‌ల‌

తెలంగాణ బీజేపీ చీఫ్ టీమ్ రెడీ.. లిస్ట్ విడుద‌ల‌

తెలంగాణ బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడిగా నియ‌మితులైన రాంచంద‌ర్‌రావు త‌న టీమ్‌ను రెడీ చేసుకున్నాడు. ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో బీజేపీ స‌మావేశాలు నిర్వ‌హిస్తూ క్యాడ‌ర్‌తో ప‌రిచ‌యం పెంచుకుంటున్న రాంచంద‌ర్‌రావు.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త కమిటీలో 22 మంది సభ్యులు ఉన్నారు, ఇందులో 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారి, ఒక సంయుక్త కోశాధికారి, మరియు ఒక ప్రధాన అధికార ప్రతినిధి ఉన్నారు.

కొత్త కార్యవర్గంలో ముఖ్య పదవులు
డా.ఎన్‌.గౌతమ్‌రావు, టి.వీరేందర్‌గౌడ్, వేముల అశోక్ బీజేపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శులుగా నియ‌మితుల‌య్యారు. ఉపాధ్యక్షులుగా, డా.బూర నర్సయ్యగౌడ్, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ, కొల్లి మాధవి, బండా కార్తీకరెడ్డి, డా.జె.గోపి, రఘునాథరావుల‌ను ఎంపిక చేశారు. అదే విధంగా కోశాధికారిగా దేవకి వాసుదేవ్‌, ప్రధాన అధికార ప్రతినిధిగా సుభాష్‌ను నియ‌మించారు.

వివిధ మోర్చాల అధ్యక్షులు
మహిళా మోర్చా: డా.మేకల శిల్పారెడ్డి
యువ మోర్చా: గణేశ్‌ కుందే
ఓబీసీ మోర్చా: గంథమళ్ల ఆనంద్‌గౌడ్‌ (కొనసాగింపు)
కిసాన్‌ మోర్చా: బి.లక్ష్మీనరసయ్య
ఎస్సీ మోర్చా: కాంతి కిరణ్
ఎస్టీ మోర్చా: నేనావత్‌ రవినాయక్
మైనారిటీ మోర్చా: సర్దార్‌ జగన్‌మోహన్‌సింగ్‌

కొత్త కమిటీ ఎంపికలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సులను పట్టించుకోలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment