అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్

అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్

ప్రైవేట్ నెట్‌వర్క్ (Private Network) ఆసుపత్రుల్లో (Hospitals) ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద అందించే సేవలు తెలంగాణ (Telangana)లో నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం తమ డిమాండ్లపై పట్టుబట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేయబడ్డాయి. ప్రభుత్వం నెలకు రూ.100 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చినా, నెలకు కనీసం రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆసుపత్రుల సంఘం పట్టుబడుతోంది. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్ (Vaddiraju Rakesh) స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ (Uday Kumar) ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను సేవలు యథావిధిగా కొనసాగించాలని కోరారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. గత 21 నెలల్లో ప్రభుత్వం ఆసుపత్రులకు రూ.1,779 కోట్లు చెల్లించిందని సీఈఓ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచినట్లు ఆయన తెలిపారు. చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేరికతో ప్రభుత్వం రోగుల కోసం అదనంగా రూ.487.29 కోట్లు ఖర్చు చేస్తోందని కూడా ఆయన వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment