బ‌న‌క‌చ‌ర్ల ప్ర‌స్తావ‌నే లేదు.. కృష్ణా నదీ జలాలపైనే స‌మావేశం – సీఎం రేవంత్‌

బ‌న‌క‌చ‌ర్ల ప్ర‌స్తావ‌నే లేదు.. కృష్ణా నదీ జలాలపైనే స‌మావేశం - సీఎం రేవంత్‌

కేంద్ర‌మంత్రి (Central Minister) స‌మ‌క్షంలో జ‌రిగిన తెలుగు రాష్ట్రాల (Telugu States) ముఖ్య‌మంత్రుల (Chief Ministers) స‌మావేశంలో బ‌న‌క‌చ‌ర్ల (Banakacharla) ప్ర‌స్తావ‌నే లేద‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. ఢిల్లీ (Delhi)లో బుధ‌వారం కేంద్ర జలశక్తి (Central Jal Shakti) శాఖ మంత్రి (Minister) సి.ఆర్. పాటిల్ (C.R.Patil) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో కృష్ణా నదీ జలాల (Krishna River Water)  వినియోగం, టెలిమెట్రీ (Telemetry) ఏర్పాటు, శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project) మరమ్మతులు, నీటి వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.

ఈ స‌మావేశం అనంత‌రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)తో క‌లిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ భేటీ అపెక్స్ కమిటీ సమావేశం కాదని, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జరిగిన చర్చల్లో కేంద్రం నిర్వాహక పాత్ర మాత్రమే పోషించిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla)  లింక్ ప్రాజెక్టు (Link Project) అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదని ఆయన తెలిపారు. టెలిమెట్రీ ఏర్పాటు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి వినియోగంపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం తెలంగాణకు విజయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “గతంలో కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారు. ఆ తప్పులను సరిదిద్దేందుకు మేం కృషి చేస్తున్నాం,” అని ఆయన ఆరోపించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా నదీ జలాల వినియోగంపై అనుమానాలు ఉన్నాయని, విభజన చట్టం ప్రకారం టెలిమెట్రీ ఏర్పాటు తప్పనిసరని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించిందని విమర్శించారు. “మేం అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీని ఖర్చును భరిస్తామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు నిధులు విడుదల చేశాం” అని ఆయన వివ‌రించారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులను వెంటనే చేపట్టాలని, కృష్ణా జలాల వినియోగంపై నిపుణులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయమైందని తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, కేఆర్ఎంబీ అమరావతిలో ఏర్పాటుకు కూడా ఒప్పందం కుదిరిందని ఉత్తమ్ వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment