తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా వరుస ఒప్పందాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా హైదరాబాద్ కేంద్రంగా రూ.10,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ‘కంట్రోల్ ఎస్’ (Control S) సంస్థతో ఎంవోయూ (MOU) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ 100 మెగావాట్ల సామర్థ్యంతో రూపొందనుంది. దీని ద్వారా 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

కొత్త పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు..
తెలంగాణ ప్రభుత్వం మరో రెండు కీలక ఒప్పందాలను కూడా సాధించింది. స్కైరూట్ (Skyroot) రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ రాకెట్ల తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ (HCL Tech Global) క్యాంపస్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్ప‌డ‌నున్నాయి.

ఫిబ్రవరిలో కొత్త హెచ్‌సీఎల్ క్యాంపస్ ప్రారంభం
హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సంస్థ తమ క్యాంపస్‌ను ఫిబ్రవరి నాటికి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయమై సీఎంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. దావోస్ సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ పెట్టుబడులకు గేట్‌వేగా మారుతోందని పేర్కొన్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి మరింత ఆర్థిక పురోగతిని తెచ్చిపెట్టనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment