టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) నుండి తాజా అప్డేట్ వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆధ్యాత్మికతను సమ్మిళితం చేసిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ‘మిరాయ్’పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.