ప్రముఖ ఇంగ్లిష్ ట్రైనర్, కేడీ క్యాంపస్ ఫౌండర్ (KD Campus Founder) నీతూ సింగ్ (Neetu Singh) తన ఆన్లైన్ క్లాస్ (Online Class)లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. “పురుషులు (Men) కుక్కల(Dogs) వంటివాళ్లు” అని ఆమె వ్యాఖ్యానించడంతో నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె వ్యాఖ్యలు పురుషులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు “అరెస్ట్(Arrest) చేయాలి” అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ విమర్శల మధ్య, తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని నీతూ సింగ్ స్పష్టం చేశారు. “పురుషులు యజమానిపై నమ్మకంగా ఉంటారు” అన్న భావనతోనే ఆ ఉదాహరణ ఇచ్చానని ఆమె వివరణ ఇచ్చినా, వివాదం చల్లారలేదు.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో విభిన్న ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. “ఇలాంటి వ్యాఖ్యలను సహించరాదు” అని పలువురు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు “పురుషుల హక్కుల కోసం ఇప్పుడు గొంతు విప్పాల్సిన సమయం” అని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.







