శ్రీకాకుళంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి బాలిక‌పై లైంగిక‌దాడి

శ్రీకాకుళంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి బాలిక‌పై లైంగిక‌దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో 9వ త‌ర‌గ‌తి బాలిక‌ను న‌మ్మించి, కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి లైంగిక దాడికి పాల్ప‌డి, ఆ బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన సంఘ‌ట‌న తాజాగా వెలుగుచూసింది. దీంతో బాలిక‌ కుటుంబం న్యాయం కోసం పోలీసులు వద్దకు చేరుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. కోటిపల్లి రాజు ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించాడు. ఈ ఘటన బాలిక గర్భవతిగా మారిన తరువాత బయటపడింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

కోటిపల్లి రాజు టీడీపీ కార్యకర్తగా తనను గుర్తించుకుంటూ, పార్టీ నాయకుల అండతో బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. త‌మ కుటుంబానికి న్యాయం చేయాలని, రాజు లాంటి వ్యక్తులు సమాజంలో తిరగాలంటేనే భ‌య‌ప‌డేలా శిక్షించాల‌ని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమాజంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment