టీడీపీ కార్య‌క‌ర్త‌ వేధింపులకు మ‌హిళ‌ ఆత్మ‌హ‌త్య‌.. సెల్ఫీ వీడియో వైర‌ల్‌

ప‌దిమందిలో త‌న‌కు జ‌రిగిన అవ‌మానం త‌ట్టుకోలేకి ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఎన్టీఆర్ జిల్లా (NTR district) చందర్లపాడు (Chandarlapadu) మండలం విభరింతలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఆత్మ‌హ‌త్య (Suicide)చేసుకున్న మ‌హిళ (Women) త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని సెల్ఫీ వీడియో (Selfie video) ద్వారా వివ‌రిస్తూ క‌న్నీరు పెట్టుకుంది. ప్ర‌స్తుతం ఆ సెల్ఫీ వీడియో వైర‌ల్‌గా మారింది.

చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి అనే మహిళ స్థానికంగా జ‌రిగే ఉపాధి హామీ పనులకు కూలీగా వెళ్తుంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త (TDP Worker) మైలా రవితేజ (Maila Raviteja) ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా (Field Assistant) విధులు నిర్వ‌హిస్తున్నారు. సోమ‌వారం ఉద‌యం ఉపాధి హామీ ప‌నికి వెళ్లిన త‌న‌పై ర‌వితేజ దౌర్జ‌న్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని క‌న్నీరు పెట్టుకుంది. సెల్ఫీ వీడియోలో మాధురి త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని వివ‌రిస్తూ.. “నన్ను రవితేజ నోటికొచ్చినట్లు దూషించాడు. దౌర్జన్యం చేశాడు. అందరూ చూస్తుండగానే జరిగిందీ ఘటన. అయినా ఎవరూ నాకు సాయం చేయలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన మరణానికి ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజనే బాధ్యుడిగా మాధురి వివ‌రించారు.

తాను నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అభిమానిని అని, సీఎం చంద్ర‌బాబు అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా.. అమిత‌మైన అభిమానం అని, అమ‌రావ‌తిలో జ‌రిగిన మోడీ స‌భ‌కు సొంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకొని వ‌చ్చాన‌ని మాధురి త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచింది. “ర‌వితేజ చేతిలో నాకు జరిగిన అన్యాయం ఇంకో మహిళకు జరగకూడదు. నేను చనిపోతున్నా, కానీ నా పక్కన వున్న మహిళలు ఇలాంటి అవమానాలు చవిచూడకూడదు సెల్ఫీ వీడియోలో త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక చివరగా, తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి విజ్ఞప్తి చేసింది. మాధురి మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌, మ‌రో తెలుగుదేశం పార్టీ అభిమానిని వేధించి ఆమె ప్రాణాలు తీసుకునేలా ప్ర‌వ‌ర్తించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మాధురి సెల్ఫీ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment