క్రిమిన‌ల్ కేసుల్లో టీడీపీదే ఫ‌స్ట్ ప్లేస్‌.. ఏడీఆర్ సంచ‌ల‌న స‌ర్వే

క్రిమిన‌ల్ కేసుల్లో టీడీపీదే ఫ‌స్ట్ ప్లేస్‌.. ఏడీఆర్ సంచ‌ల‌న స‌ర్వే

దేశ వ్యాప్తంగా ఎంపీలే కాక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎమ్మెల్యేలలో ఎందరు నేరచరితులు ఉన్నారో తెలుసా..? ఆ లెక్కలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తన నివేదిక ద్వారా అందించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన‌ 134 మందికి గాను 115 మంది (86 శాతం)పై క్రిమినల్ కేసులు, 82 మంది (61 శాతం)పై తీవ్రమైన కేసులు ఉన్నట్లు తెలిపింది.

ఇక 1,653 మంది బీజేపీ ఎమ్మెల్యే లకుగాను 638 మంది(39 శాతం)పై కేసులు ఉన్నట్లు పేర్కొంది. 52 శాతం మంది కాంగ్రెస్ 2(339/646), 41 శాతం TMC(95/230) ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని ఏడీఆర్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఎమ్మెల్యేల నేరచరిత్రపై విడుదల చేసిన ఆసక్తి కర అంశాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment