టీడీపీ ఎమ్మెల్యే పీఏకి ఆరుగురు పీఏలు

టీడీపీ ఎమ్మెల్యే పీఏకి ఆరుగురు పీఏలు

ఏపీ(AP)లోని అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ తీరు ర‌చ్చ‌కెక్కింది. చిత్తూరు (Chittoor) జిల్లా జీడినెల్లూరు (Jidinetlluru) నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) థామస్ (Thomas) పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) చంద్ర శేఖర్‌ (Chandra Shekhar)ను విధుల నుంచి తొలగించాలని సొంత పార్టీ నేత‌లు, అందులోనూ టీడీపీ ఎమ్మెల్యే త‌మ్ముడు సైతం డిమాండ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎమ్మెల్యే పీఏ తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. చంద్రశేఖర్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయాల్లో జోక్యం చేస్తూ, రాజ‌కీయ‌ వ్యవహారాల్లో పాల్గొంటున్నారని ఎమ్మెల్యే అనుచ‌రులు ఆరోపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఫిర్యాదులో భాగంగా టీడీపీ నేతలు ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఎమ్మెల్యేకి ఒక పీఏ ఉంటే.. ఎమ్మెల్యే పీఏకి ఆరు మండ‌లాల్లో ఆరుగురు (Six) పీఏలు ఉన్నార‌న్నారు. టీడీపీలో ప్రతి మండలంలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు దండించుకున్నాడని చెప్పారు. ఈ వ్యవహారం టిడిపి అధిష్టానానికి, ఎమ్మెల్యే థామస్‌ దృష్టికీ తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అంతేకాదు చంద్రశేఖర్‌తో పాటు నలుగురు ముఠా సభ్యులు నియోజకవర్గాన్ని అన్యాయంగా ఆస్తుల కోసం దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఫిర్యాదు చేసేవారిలో ఎమ్మెల్యే థామస్ సోదరుడు నిధి కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రశేఖర్‌పై విజిలెన్స్ విచారణ జరిపించాలని కూడా కలెక్టర్‌ను కోరారు. అధికారాన్ని తన స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ నియోజకవర్గంలో రాజకీయ స్వార్థాలను నెరవేర్చే పనుల్లో చంద్రశేఖర్‌ నిమగ్నమై ఉన్నాడని నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment