మ‌రో ప్రిన్సిప‌ల్‌తో ఎమ్మెల్యే కూన‌.. వైసీపీ ట్రూత్ బాంబ్‌

మ‌రో ప్రిన్సిప‌ల్‌తో ఎమ్మెల్యే కూన‌.. వైసీపీ ట్రూత్ బాంబ్‌

ఆముదాల‌వ‌ల‌స టీడీపీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్ వ్య‌వ‌హారం తెలుగుదేశం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు రోజురోజుకూ మ‌రింత‌గా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే పొందూరు KGBV ప్రిన్సిప‌ల్ సౌమ్య‌పై వేధింపుల కార‌ణంగా ఆమెను ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్రేరేపించారన్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కూన‌, ఇప్పుడు మ‌రో ప్రిన్సిప‌ల్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ ఈ ఫొటోలను రిలీజ్ చేస్తూ, ఒక్కొక్క‌టిగా కూన వ్య‌వ‌హారాలు వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని విమ‌ర్శలు గుప్పించింది.

వైసీపీ బ‌హిర్గతం చేసిన ఫొటోలో కూన ర‌వికుమార్ మ‌రొక KGBV ప్రిన్సిప‌ల్‌తో ఒంటిమిట్ట ఆల‌యంలో దర్శనమిచ్చినట్లు క‌నిపిస్తున్నారు. ఆల‌య మ‌ర్యాద‌ల‌తో, ప్ర‌త్యేక పూజ‌ల‌తో స్వాగ‌తం అందుకున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి మ‌ర్యాదలు జీవిత భాగస్వాములు, కుటుంబ స‌భ్యులకే ఉంటాయని ప్రజలు వ్యాఖ్యానిస్తుండ‌గా, ఎమ్మెల్యే కూన మ‌రొక మ‌హిళ‌తో ఆ మ‌ర్యాదలు అందుకోవ‌డం ప‌ట్ల విప‌రీత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్యే వేధింపులు భరించలేక దళిత మహిళ సౌమ్య‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తుండగా, తాజాగా వెలుగులోకి వస్తున్న ఆధారాలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై కూన రవికుమార్ మాత్రం తాను ఎవ్వరినీ వేధించలేదని, తనపై జరుగుతున్నవి కేవలం రాజకీయ కుతంత్రాలని మీడియా ముందు చెబుతున్నారు. అయినప్పటికీ, ఆయన వ్యవహారం టీడీపీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోందని విశ్లేషకులు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment