అవును, శ్రీ‌కాంత్ పెరోల్‌కు లేఖ ఇచ్చా – ఎమ్మెల్యే కోటంరెడ్డి

అవును, శ్రీ‌కాంత్ పెరోల్‌కు లేఖ ఇచ్చా - ఎమ్మెల్యే కోటంరెడ్డి

రౌడీషీటర్ (Rowdy-Sheeter) శ్రీకాంత్ (Srikant) పెరోల్ (Parole) ఇష్యూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పెరోల్ మంజూరుకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే(MLA) లేఖ‌లు (Letters) ఇచ్చార‌ని, హోంమంత్రి పేషీ నుంచే ఫైల్ క‌దిలింద‌ని వైసీపీ (YSRCP) సంచ‌ల‌న ఆధారాలు (Evidence) బ‌య‌ట‌పెట్టిన నేప‌థ్యంలో, అధికార తెలుగుదేశం పార్టీపై వివాదంలో ఇరుక్కుంది. ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తన పాత్రను స్వయంగా అంగీకరించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. “శ్రీకాంత్ తండ్రి అభ్యర్థన మేరకు నేను లేఖ ఇచ్చాను. అయితే నేను ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారు. పెరోల్ ఇవ్వలేమని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజాప్రతినిధులుగా చాలామందికి ఇలాంటి లేఖలు ఇస్తుంటాం” అని తెలిపారు. అయితే, హోంమంత్రి (Home Minister) అనిత (Anitha) ఈ విషయంపై ఇప్పటికే విచారణకు ఆదేశించారు. దీనిపై కోటంరెడ్డి స్పందిస్తూ, “విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ సంఘటన రాజకీయనేతలకు ఒక పాఠం. ఇకపై ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నేను పెరోల్ లేఖ ఇవ్వను. ఇకపై పెరోల్ కోసం నా ఆఫీసు వద్ద ఎవరూ రాకూడదు” అని స్పష్టం చేశారు. అయితే వైసీపీ ఆరోపించిన‌ట్లుగానే నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి లేఖ తానే ఇచ్చిన‌ట్లుగా ఒప్పుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉండగా, వైసీపీ ఈ ఇష్యూపై టీడీపీపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. పెరోల్ మంజూరు వెనుక హోంమంత్రి ప్రమేయమే ఉందని ఆరోపిస్తున్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల లేఖలను ఆధారాలుగా చూపిస్తుంది. మరోవైపు, కోటంరెడ్డి అంగీకారంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment