నేపాల్ (Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కడప (Kadapa), కర్నూలు (Kurnool) జిల్లాల నుండి వెళ్లిన 48 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి డోన్ (Dhone) నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (Kotla Suryaprakash Reddy) కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ఎమ్మెల్యే భార్య, కుమార్తె
చిక్కుకుపోయిన పర్యాటకుల్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాత (Sujatha), కుమార్తె నివేదిత (Nivedita) కూడా ఉన్నారు. అల్లర్ల సమయంలో వారి లగేజీ, మొబైల్ ఫోన్లు తగలబడిపోయాయని సమాచారం.
డోన్ వాసుల పరిస్థితి
ఎమ్మెల్యే కుటుంబంతో పాటు, డోన్ ప్రాంతానికి చెందిన మరికొందరు కూడా అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఒక హోటల్‌లో తలదాచుకున్నారని సమాచారం. వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.