ఆడవారిని అత్యంత గౌరవించే పార్టీ అని వేదికలపై చెప్పుకునే తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కి చెందిన ఓ ఎమ్మెల్యే(MLA) జూ.ఎన్టీఆర్(Jr.NTR)ని, అతని తల్లిపై అవమానకర రీతిలో అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌పై బూతులు తిడుతూ రెచ్చిపోయాడు అనంతపురం (Anantapur) టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad). ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్‌పై అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్(Nara Lokesh)కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అనంతపురంలో ఆడనివ్వవంటూ హెచ్చరించారు.
వార్ -2 (War -2) విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు (Dhanunjaya Naidu) ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు (Abuse) పురాణం వైరల్‌గా మారింది. లం* కొడుకు, వాని అమ్మ*** అంటూ తారక్(Tarak)పై ఎమ్మెల్యే అత్యంత దారుణంగా మాట్లాడాడు.
జూ.ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన @JaiTDP ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
— Telugu Feed (@Telugufeedsite) August 17, 2025
లం* కొడుకు అంటూ తారక్ పై @PrasadDOfficial అసభ్యకరంగా దూషణలు
జూ.ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ pic.twitter.com/53PX6ZgtVB
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కుటుంబమే అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే జూ.ఎన్టీఆర్‌ను తొక్కేయాలని చూస్తోందని, నారా లోకేష్ సహకారంతోనే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అసభ్యంగా మాట్లాడారని యంగ్ టైగర్ అభిమానులు మండిపడుతున్నారు. టీడీపీకి అసలైన వారసుడు ఎన్టీఆర్ మాత్రమేనని, అతని అన్ని రకాలుగా దిగజార్చి ప్రతిష్ట దెబ్బతీయాలనే ఓ పథకం ప్రకారం టీడీపీ అగ్రనాయకత్వం ఇలా చేయిస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నారా వారి రాజకీయం ఇలాగే ఉంటుందని, నాడు సీనియర్ ఎన్టీఆర్.. నేడు జూ.ఎన్టీఆర్ అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







