వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి ఏపీ రాజకీయాల్లో మరోసారి హట్ టాపిక్‌గా నిలిచారు. కారు డ్రైవర్ బూతుపురాణంతో విరుచుకుపడ్డారు. తన కారుకు అడ్డం పెట్టాడని డ్రైవర్ ఇంట్లోని కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేసిన డ్రైవర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కావడం గమనార్హం.
దెందులూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఓ వేడుకు హాజరయ్యారు. కారు పార్కింగ్‌లో ఉండగా, ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే కారు వెనుక నుంచి వచ్చింది. ఎదురుగా అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా ఉండటాన్ని గమనించిన చింతమనేని.. ఆక్రోశం ఆపుకోలేక డ్రైవర్‌పై అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతూ రెచ్చిపోయారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. డ్రైవర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా టీడీపీ నేతలు తమపైనే ఆరోపణలు చేస్తున్నారని, చింతమనేని నువ్వు మారవా? ఇంకెప్పుడు సంస్కారం నేర్చుకుంటావు’ అని వైసీపీ మండిపడుతోంది.