ఇటీవల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకుల మాటలు మితిమీరుతున్నాయనే విమర్శలు తాజా ఘటనలు బలం చేకూర్చుతున్నాయి. ఒకవైపు ఐఏఎస్ అధికారులను కించపరిచే వ్యాఖ్యలు, మరోవైపు జర్నలిస్టులపై బూతు పదజాలంతో మాట్లాడడం రాజకీయంగా పెను దుమారంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న నాయకుల నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju) జర్నలిస్టులను (Journalists) ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జర్నలిస్టు సాయిపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్య పదజాలం ఉపయోగించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
”మీ జర్నలిస్టు కులంలో సాయి గాడు (జర్నలిస్ట్ సాయి) ఒక బ్రోకర్ నా కొడుకు. ఓపెన్ గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకని. రేయ్ సాయి నీకు. వాడు అదే పనిగా జగన్‌మోన్ రెడ్డికి భజన.. అలా కొంతమంది ఉన్నారు. అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్.. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తుందా? వెధవ నా కొడుకుల్లారా! రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తుంది”అంటూ రఘురామకృష్ణరాజు రెచ్చిపోయారు. వాస్తవాలను ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే ‘భజన’ చేసినట్టా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో తమకు అనుకూలంగా ప్రసారం చేసే మీడియా ఛానెళ్లను మాత్రం సమర్థించడంలో ఏమాత్రం సందేహం చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఐఏఎస్‌లపై దీపక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మరోవైపు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి (Deepak Reddy) చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారు. “దొంగలు ఐఏఎస్ వ్యవస్థలో ఉన్నారు, డ్రామాలు ఆడుతున్నారు” వంటి వ్యాఖ్యలు అధికార వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐఏఎస్ వంటి అత్యున్నత పరిపాలనా వ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమని, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
టీడీపీ నేతలు జర్నలిస్టులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై కనీస గౌరవం చూపడం లేదని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార అహం తలకెక్కి, నోటికొచ్చినట్లుగా మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కన్నూమిన్ను కానకుండా ఏ వ్యవస్థనైనా కించపరిచేలా మాట్లాడటం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐఏఎస్ అధికారులపై టీడీపీ నేత దీపక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
— Telugu Feed (@Telugufeedsite) December 25, 2025
దొంగలు, దరిద్రం చుట్టుకున్నట్టు చుట్టుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు
ఏమీ రోగం.. నీతులు మాట్లాడుతారు.. డ్రామాలు ఆడుతారు
నా మీద తిరుగుబాటు చేస్తే వాళ్ల చరిత్ర తీస్తా.. దొంగలు ఐఏఎస్ వ్యవస్థలో ఉన్నారు
– దీపక్ రెడ్డి
VC… https://t.co/3JDp7tmV1G pic.twitter.com/tCOaxV8XDc








