టీడీపీని న‌మ్మి రోడ్డున‌ప‌డ్డ.. యువ‌ నేత ఆత్మహత్యాయత్నం

TDP, Madanapalle, Suicide Attempt, Andhra Pradesh Politics, Velpula Venkatesh

తెలుగుదేశం (TDP) పార్టీ కష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు తాను పార్టీ కోసం నిల‌బ‌డ్డాన‌ని, కానీ పార్టీ మాత్రం త‌న కుటుంబాన్ని(Family) రోడ్డున ప‌డేసింద‌ని టీడీపీ నేత తీవ్ర మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య‌కు (Suicide) య‌త్నించిన సంఘ‌ట‌న మ‌ద‌న‌ప‌ల్లె (Madanapalle) లో చోటుచేసుకుంది. రాజంపేట పార్లమెంట్ ఐ-టీడీపీ (I-TDP) కమిటీ ఉపాధ్యక్షుడు (Vice-President) వేల్పుల వెంకటేశ్ (Velpula Venkatesh) ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డి సంచలనం రేపారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఆర్థికంగా (Financially) తీవ్రంగా నష్టపోయానని, తన కుటుంబం రోడ్డున పడిందని పేర్కొంటూ గురువారం ఫేస్‌బుక్‌ (Facebook) లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయనను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.

వెంక‌టేశ్ ఫేస్‌బుక్ పోస్టు వైర‌ల్‌
ఇక సెలవు పార్టీని నమ్మి చాలా నష్టపోయాన‌ని భావోద్వేగ పోస్టు పెట్టారు. త‌న‌ కుటుంబం రోడ్డున పడిందని, చాలా అవమానాలు బాధలు పడ్డాన‌ని, గత 5 సంవత్సరాలుగా పార్టీనే ఊపిరిగా పనిచేసి సర్వం కోల్పోయానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డబ్బుంటేనే రాజకీయాలు చేయండి లేకపోతే వద్దని త‌న తోటి వారికి సూచించారు. అధికారంలోకి వచ్చామనే సంతోషం తప్ప ఇంకేం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘటన టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాజంపేట పార్ల‌మెంట్ ఐ-టీడీపీ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేస్తున్న వెంక‌టేశ్ ప‌రిస్థితి ఆ పార్టీ క్యాడ‌ర్‌ (Party Cadre) ను గంద‌ర‌గోళంలో ప‌డేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment