మొద‌ట బూతులు.. త‌ర్వాత నీతులు

ఎరగా వేసి.. బచ్చాని కొట్టి బాకాలు

వైసీపీ (YSRCP) అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ (Y. S. Jagan) కుటుంబంపై ఐటీడీపీ కార్య‌క‌ర్త‌ ( ITDP Activist) నీచ‌మైన, అతి దారుణ‌మైన‌ కామెంట్లు చేశాడు. కిర‌ణ్ చేబ్రోలు (Kiran Chebrolu) చేసిన జుగుప్సాక‌ర‌మైన కామెంట్లు వైసీపీ శ్రేణుల్లో క‌ట్ట‌లు తెంచే ఆగ్ర‌హాన్ని తెప్పించింది. వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న భార్య వైఎస్ భార‌తీరెడ్డి (Y. S. Bharati Reddy) ని ఉద్దేశిస్తూ చేసిన అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల‌పై (Vulgar Remarks) యావ‌త్ ఆంధ్ర రాష్ట్ర‌మంతా మండిప‌డుతోంది. నోటిదురుసుతో మీసం తిప్పుతూ కిర‌ణ్ చేబ్రోలు చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌హిళ‌లు, టీడీపీ నేత‌లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కిర‌ణ్‌ను పెంచిపోషించిన ఐటీడీపీ(ITDP).. తాజాగా అత‌ను చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో క్ష‌మాప‌ణ‌లు (Apology) చెప్పించి అత‌న్ని పార్టీ నుంచి స‌స్పెండ్ (Suspended) చేసి చేతులు దులుపుకుంది.

స‌భ్య‌తా, సంస్కారానికి ప్ర‌తీక‌గా చెప్పుకునే పార్టీలో ఉంటూ ఒక మాజీ ముఖ్య‌మంత్రిని, ఆయ‌న భార్య‌ను ఉద్దేశించి దారుణ‌మైన కామెంట్లు చేసిన కిర‌ణ్ చేబ్రోలు అనే వ్య‌క్తి.. గ‌తంలో ఆర్కే రోజా (RK Roja), విడ‌ద‌ల ర‌జిని (Vidadala Rajini)పై కూడా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కిర‌ణ్ త‌న నోటిదూల‌తో యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో ఆడ‌వారిని కించ‌ప‌రిచేలా, జ‌గ‌న్‌ను, ఆయ‌న‌ కుటుంబాన్ని అవ‌మానించేలా దారుణంగా మాట్లాడాడ‌ని వైసీపీ (YSRCP) ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

స‌స్పెండ్ చేసి ప‌బ్లిసిటీ
వైఎస్ భార‌తిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను స‌స్పెండ్ చేసి టీడీపీ అధిష్టానం చేతులు దులుపుకుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.జ‌రిగిన త‌ప్పున‌కు టీడీపీ క్ష‌మాప‌ణ‌లు కోరాల‌ని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కిర‌ణ్‌ను స‌స్పెండ్ చేసి మీడియా ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకొని ప‌బ్లిసిటీ (Publicity) చేసుకుంటుంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. బ‌చ్చాని కొట్టి బాకా ఊదుకుంటుంద‌ని అన్న కామెంట్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

కిర‌ణ్‌లాంటి వారు మ‌రెంద‌రో..?
అధికారం లోకి వ‌చ్చిన త‌రువాత టీడీపీ ఆగ‌డాల‌కు అడ్డూ అదుపులేకుండా పోయింద‌ని, ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ (Safety) లేకుండా పోయింద‌ని ఎక్స్ వేదిక‌గా ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కి ఏమాత్రం చిత్త‌శుద్ధి ఉన్నా.. టీడీపీ కండువా వేసుకొని ఆడ‌వారిని కించ‌ప‌రిచేలా మాట్లాడుతున్న కిరాక్ ఆర్పీ (Kiraak RP) లాంటివారిని వెంట‌నే అరెస్టు (Arrest) చేస్తే త‌ప్ప‌.. ఇలాంటి ఉన్మాదుల తీరు మార‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. వేరే పార్టీ కండువా వేసుకొని అంత‌ర్జాతీయ కార్య‌కర్త ముసుగులో అధికార పార్టీ కోసం ప‌నిచేస్తున్న యూట్యూబ‌ర్ సీమ‌రాజా (Seemaraja) ఆగ‌డాల‌కు అడ్డుకుట్ట వేయాల‌న్న వాద‌న‌లు పెరుగుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వైసీపీ మ‌హిళా నేత‌ల‌ను, జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌ను కించ‌ప‌రిచేలా అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన వారిపై కేసులు న‌మోదు చేసి చిత్త‌శుద్ధి నిరూపించుకోవాల‌ని నెటిజ‌న్లు కూట‌మి ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేస్తున్నారు.

కిరణ్‌ను పెంచిపోషించింది టీడీపీనేనా?
మ‌హిళ‌లపై నిత్యం అనుచిత వ్యాఖ్య‌లు, అస‌భ్య‌ప‌ద‌జాలంతో రెచ్చిపోతున్న చేబ్రోలు కిర‌ణ్ (Chebrolu Kiran) వ్య‌వ‌హార శైలిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇలాంటివారిని కొంద‌రిని చిన‌బాబు ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఐటీడీపీ వింగ్ (ITDP wing) పెంచి పోషిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కిర‌ణ్ గ‌తంలోనూ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని, మ‌రికొంత‌మంది మ‌హిళా నేత‌ల‌ను కించ‌ప‌రుస్తూ చేసిన వీడియోలను నెటిజ‌న్లు బ‌య‌ట‌పెడుతున్నారు. ఐటీడీపీ తీరును ఎండ‌గ‌డుతున్నారు. విదేశాల్లో ఉంటూ స్వాతిరెడ్డి (Swathi Reddy), య‌ష్ బొద్దులూరి (Yash Bodduluri) వంటివారు ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌హిళ‌లు, ప్ర‌ముఖుల మీద నిత్యం బుర‌ద‌చ‌ల్లుతూ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. చిన‌బాబు దృష్టిలో ప‌డేందుకే ఇవ‌న్నీ చేస్తున్నార‌న్న వ్య‌క్తం అవుతుండ‌గా, ఏనాడూ వీరిని క‌ట్ట‌డి చేయాల‌నే ఆలోచ‌న అధికార పార్టీ అధిష్టానానికి రాక‌పోవ‌డం విడ్డూరం అంటున్నారు. కిర‌ణ్ చేబ్రోలుపై విడ‌ద‌ల ర‌జిని ఫిర్యాదు చేసి ఆరు నెల‌లు గ‌డిచినా ఇప్ప‌టివ‌రకు కేసు కూడా న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో అత‌నికి టీడీపీ అండ ఉంద‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోందని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment