ఎమ్మెల్యే సౌమ్య‌కు టీడీపీ షాక్‌.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్

ఎమ్మెల్యే సౌమ్య‌కు టీడీపీ షాక్‌.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే సూచించిన వారికి కాకుండా అధిష్టానం కొత్త‌పేరును తెర‌పైకి తెచ్చింది. నందిగామ‌ మున్సిపాలిటీ పదో వార్డు కౌన్సిల‌ర్ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించింది. దీంతో ఎమ్మెల్యే సౌమ్య‌కు షాక్ త‌గిలింది.

ఎమ్మెల్యే సౌమ్య సత్యవతి పేరును అధిష్టానానికి సూచించ‌గా, టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌తిపాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా కృష్ణ‌కుమారి పేరును సూచించింది. స‌త్య‌వ‌తికి బీఫామ్ వస్తుందని ఆశించిగా కొత్త‌పేరు తెర‌పైకి వ‌చ్చింది. కృష్ణకుమారి పేరుతో బీఫామ్ రావడంతో ఎమ్మెల్యే సౌమ్య అస‌హ‌నానికి గురైన‌ట్లుగా తెలుస్తోంది. కౌన్సిలర్ తో కలిసి ఎన్నిక జరిగే చోటుకు వెళ్లారు.

రాష్ట్రంలో నిన్న వాయిదాపడిన ఐదుచోట్ల మేయర్ , చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జ‌రుగుతున్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక‌తో పాటుగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్, పిడుగురాళ్ల, తుని మున్సిపాలిటీల వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక, పాలకొండ నగర‌ పంచాయతీ చైర్ పర్సన్ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment