ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛ‌న్లు కోత.. ‘లిబ్‌టెక్‌ ఇండియా’ సంచ‌ల‌న స‌ర్వే

ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛ‌న్లు కోత.. 'లిబ్‌టెక్‌ ఇండియా' సంచ‌ల‌న స‌ర్వే

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్లపై ప్రభుత్వం కత్తిరింపుల ప్రక్రియ కొనసాగుతోంది. 2024 జూన్‌లో 65.5 లక్షల పింఛన్లు పంపిణీ చేయగా, డిసెంబర్ చివరికి ఈ సంఖ్య 63.92 లక్షలకు తగ్గిపోయింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే 1.60 లక్షల పింఛన్లు రద్దయ్యాయని చెబుతున్నారు. వెరిఫికేష‌న్ పేరుతో పండుటాకుల పెన్ష‌న్ క‌త్తిరిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

పింఛన్ల తగ్గుదలపై విమర్శలు
తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు రూ.4 వేల‌కు పెంచినప్పటికీ, ఇప్పుడు అనర్హుల ఏరివేత పేరిట కోతలు పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తగ్గుదల లిబ్‌టెక్‌ ఇండియా సంస్థ అందించిన గణాంకాల ఆధారంగా వెల్లడైంది. ఇంజినీర్లు, సామాజిక కార్యకర్తలు కలిసి పింఛన్ల డాటాను క్రమం తప్పకుండా ట్రాక్‌ చేయడం ద్వారా ఈ గణాంకాలను రూపొందించారని తెలిపింది. డిసెంబరు 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక సచివాలయాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి క్షేత్రస్ధాయిలో పరిశీలన చేశారు. ఈ సర్వేలో 10,958 మంది పింఛన్‌దారులను పరిశీలిస్తే ఐదు శాతం మందిని అనర్హులుగా సర్వే టీమ్‌లు గుర్తించాయి. అయితే, పింఛన్ల కోత ఒక క్రమ పద్ధతి ప్రకారం జరుగుతోందని, ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల ఉంటోందని ‘లిబ్‌టెక్‌ ఇండియా’ పేర్కొంది.

కుడి చేత్తో పెంచి ఎడమ చేత్తో ప్రభుత్వం కోత పెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అనర్హుల ఏరివేత పేరిట ఈ ప్రక్రియ సాగుతోందని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఆరు నెలల కాలంలో 1.60 లక్షల పింఛన్లపై వేటు పడినట్లు ‘ది న్యూస్‌ మినిట్‌’ వెబ్‌సైట్ ఒక క‌థ‌నాన్ని ప‌బ్లిష్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment