ఓటింగ్‌ కోసం పోలీసుల కాళ్లు మొక్కిన ఓట‌ర్లు

ఓటింగ్‌ కోసం పోలీసుల కాళ్లు మొక్కిన ఓట‌ర్లు

పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నిక (By Election) ర‌సాభాస‌గా సాగింది. ఉప ఎన్నిక‌లో ఓ దారుణ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌మ ఓటు హక్కు వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని పులివెందుల క‌నంప‌ల్లి (Kanampalli)కి చెందిన ఓట‌ర్లు పోలీసుల కాళ్లు ప‌ట్టుకున్న దృశ్యాలు నెట్టింట సంచ‌ల‌నంగా మారాయి. “మా ఓటు మమ్మల్ని వేయనీయండి” అని వేడుకున్నా, పోలీసులు కనికరించలేదని గ్రామస్తులు వాపోయారు.

జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంద‌ర్భంగా కనంపల్లి గ్రామంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానికులు వివ‌రాల ప్రకారం, ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి బహిరంగంగానే దొంగ ఓట్లు వేస్తుండగా, పోలీసులు తామే దగ్గరుండి రిగ్గింగ్‌ జరుగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలపై గ్రామస్థుల ఆగ్రహం ఉధృతమైంది.

మరోవైపు, పులివెందుల మండలంలోని అనేక మహిళా ఓటర్లు కూడా తమను ఓటేయకుండా అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “పోలీసులే ఇళ్లలోకి దూరి మమ్మల్ని బెదిరించారు. మా చేతుల్లోని ఓటర్‌ స్లిప్పులను లాక్కున్నారు. పోలింగ్‌ బూత్‌కు వస్తే దాని పరిణామాలు భరించాల్సి వస్తుందని హెచ్చరించారు” అని వారు తెలిపారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని, వందలాది స్థానికేతర వ్యక్తులు తమ ఓట్లు వేసినట్లు వారు ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment