గడిచిన సంవత్సరంలో జరిగిన మధుర స్మృతులను, విషాద ఘటనలను తలుచుకుంటూ ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్‌లో వీడ్కోలు పలుకుతుంటారు. కొందరు వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో, మరికొందరు మెసేజ్‌లు, కార్టూన్‌లు, కొటేషన్ రూపంలో ఎవరికి తోచినట్లుగా వారు విడిచి వెళ్లిపోతున్న ఏడాదికి బై బై చెబుతూ.. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
కానీ తణుకులో కొందరు యువకులు వినూత్న రీతిలో 2024 సంవత్సరానికి అంతిమ వీడ్కోలు పలికారు. కర్రలతో పాడె కట్టి, వైట్ క్లాత్ దానిపై పేర్చి, 2024 అని రాసి.. పూలమాల వేసి డబ్బు దరువు మధ్య గోవిందో.. గోవిందా.. అంటూ తణుకులో రహదారుల వెంట హల్‌చల్ చేశారు. ఈ ఘటన చూపరులతో నవ్వులు పూచించింది. అంతటితో ఆగకుండా పాడెను కిందపెట్టి.. రోడ్డుపై దొర్లుతూ కన్నీరు కారుస్తూ 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన వారు సైతం పగలబడి నవ్వుతున్నారు.