---Advertisement---

‘తండేల్’ న్యూ సాంగ్‌.. డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన చైతూ-సాయిప‌ల్లవి

తండేల్ న్యూ సాంగ్‌.. డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన చైతూ-సాయిప‌ల్లవి
---Advertisement---

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్’ సినిమా నుంచి తాజాగా ‘శివుడి’ పాట విడుదలైంది. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది.

‘నమో నమో నమః శివాయ..’ అంటూ సాగిన ఈ శివశక్తి పాట ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి, హరిప్రియ తెలుగులో అద్భుతంగా ఆలపించారు. హిందీలో దివ్య కుమార్, సలోని థక్కర్, తమిళ్‌లో మహా లింగం, హరిప్రియ ఈ పాటను పాడారు.

స్ఫూర్తిదాయకమైన మత్స్యకారుల కథ
‘తండేల్’ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. సముద్రంలో వేటకు వెళ్లిన వారు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి, అక్కడి ప్రభుత్వానికి చిక్కి, ఏ విధంగా బయటపడ్డారు అనే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ దేశభక్తి మరియు భావోద్వేగాలతో నిండిన కథ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

చైతు-సాయి పల్లవి మళ్లీ స్క్రీన్ షేర్
గతంలో ‘లవ్ స్టోరీ’ సినిమాతో నాగచైతన్య, సాయి పల్లవి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ జంట మరోసారి కలిసి పని చేయడం, ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ వెచ్చించడం సినిమా పై అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే టీజర్, బుజ్జితల్లి పాట హిట్ కావడంతో, ‘శివుడి’ పాట సినిమాపై మరింత క్రేజ్ తీసుకొస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment