టాలీవుడ్ కథానాయిక తమన్నా భాటియా ఇటీవల తన గత రిలేషన్షిప్ గురించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం తరువాత బ్రేకప్ వార్తలు వచ్చిన నేపథ్యంలో, తమన్నా చేసిన ఈ వ్యామెంట్స్ ఫ్యాన్స్ మరియు మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ… తన జీవితంలో ‘నిజాయితీ (Honesty)’ ఎంత ముఖ్యమో వివరించింది.
“నా విషయంలో ఎవరైనా హానెస్ట్‌గా లేకపోతే నేను అస్సలు సహించలేను. ఎవరైనా ఒక మర్డర్ చేసి వస్తే నేను సహాయం చేయడానికి ముందుంటాను, కానీ అబద్ధం చెబితే మాత్రం తట్టుకోలేను,” అంటూ ఆమె తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేసింది. ఒక రిలేషన్‌లో సుఖం (Comfort) కంటే నిజం చెప్పడమే ముఖ్యమని తమన్నా స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు నేరుగా ఎవరినీ ఉద్దేశించి చేయకపోయినా, ఆమె పాస్ట్ రిలేషన్ గురించే మాట్లాడి ఉండవచ్చని అభిమానులు బలంగా భావిస్తున్నారు. ఎందుకంటే, తమన్నా ఇటీవలే విజయ్ వర్మతో రిలేషన్‌ను ముగించినట్టు వార్తలు వచ్చాయి. బంధంలో అత్యంత ముఖ్యమైన నిజాయితీని కోల్పోవడం వల్లే బ్రేకప్ జరిగిందా అనే కోణంలో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలైంది. ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనే దానిపై తమన్నా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కానీ తమన్నా తన ప్రియుడి నుంచి మోసపోవడం వల్లే ఈ విధంగా స్పందించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తమన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.







