---Advertisement---

హీరో విశాల్ ఇలా మారిపోయాడేంటి..?

హీరో విశాల్ ఇలా మారిపోయాడేంటి..?
---Advertisement---

ప‌వ‌ర్‌ఫుల్‌ మాస్ యాక్ష‌న్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులను ఆక‌ట్టుకున్న హీరో విశాల్. పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. యూనిక్‌ యాక్ష‌న్‌, డైలాగ్ డెలివ‌రీతో కోలీవుడ్‌, టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నాడు. అలాగే తన పొలిటికల్, సినీ స్టాండ్స్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు.

ఇప్పుడు హీరో విశాల్ గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడు. తాజాగా జ‌రిగిన మదగజరాజ సినిమా ఈవెంట్‌లో విశాల్ గ‌జ‌గ‌జ వణుకుతూ కనిపించారు. ఆయన వేదికపై మైక్ ప‌ట్టుకొని మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి. చాలా నిదానంగా, మాట్లాడుతున్నంత సేపు ఎవ‌రివంక చూడ‌కుండా త‌న ప్ర‌సంగాన్ని సాగించారు.

వ‌ణుకుతూ, న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న విశాల్‌ను చూసి చాలామంది ఆయన్ను పరామర్శించారు. అయితే విశాల్ తీవ్ర జ్వ‌రంతో గ‌త కొన్నిరోజులుగా బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మదగజరాజ మూవీ 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకొగా.. 12 ఏళ్ల త‌రువాత ఇప్పుడు రిలీజ్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment