ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు డీ. ఇమ్మాన్ ట్విట్టర్ (X) ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇమ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. హ్యాకర్ ఆయన అధికారిక ఖాతాకు చెందిన ఈమెయిల్, పాస్‌వర్డ్ మార్చివేసి గత 24 గంటల్లో అనేక పోస్ట్‌లు చేశారు. తన ఖాతా నుంచి వచ్చే పోస్టులకు ఎవరూ రెస్పాండ్ కాకూడదని అభిమానులను కోరారు.
“నా అధికారిక ఎక్స్ ఖాతా హ్యాక్కయింది. హ్యాకర్ నా అకౌంట్‌కి సంబంధించిన ఈమెయిల్, పాస్‌వర్డ్ మార్చేశాడు. గత 24 గంటల్లో నా ఖాతా నుంచి అనేక పోస్టులు చేశారు. దయచేసి వాటిని పట్టించుకోకండి” అని ఇమ్మాన్ పేర్కొన్నారు.
ఇమ్మాన్ ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అభిమానులు అపరిచిత లింకులు క్లిక్ చేయకుండా, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్