ప్రేమ జంట విడిపోయిందా..? ప్రస్తుతం ఈ ప్రశ్న ఇటు టాలీవుడ్‌ను, అటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది. టాలీవుడ్ స్టార్ తమన్నా(Tamannaah Bhatia) – బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma) డేటింగ్‌కు ముగింపు(Breakup News) పలికారని తాజా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ వెబ్సైట్ ‘పింక్ విల్లా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జంట కొన్ని వారాల క్రితమే బ్రేకప్ అయ్యిందట. అయితే, స్నేహితులుగా కలిసి ముందుకు సాగాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ సినిమా సమయంలో తమన్నా – విజయ్ వర్మల ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది. సినిమా ఈవెంట్లు, సెలబ్రెటీ ఫంక్షన్లకు వీరు తరచూ హాజరవుతూ హాట్ టాపిక్‌గా నిలిచేవారు. వీరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతుండగానే, ఇప్పుడు వచ్చిన బ్రేకప్ వార్తలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.