ముంబై దాడుల సూత్రధారికి అమెరికా షాక్.. పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

ముంబై దాడుల సూత్రధారికి అమెరికా షాక్.. పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించిన తహవూర్ రాణాకు అమెరికా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దని యూఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తన మతపరమైన కారణాల వల్ల భారత్‌లో హింస ఎదుర్కొనవలసి వస్తుందని, ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని రాణా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంతేకాక, తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐక్య రాజ్య సమితి తీర్పుల ఉల్లంఘన కింద వస్తుందని వెల్లడించాడు. అయినప్పటికీ, కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించి, స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

ప్రస్తుతం జైలులో రాణా
పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడు తహవూర్ రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. అతనికి పాకిస్తాన్-అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో బలమైన సంబంధాలున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment