తాడిప‌త్రిలో టీడీపీ నేత‌ల ఫైటింగ్‌.. లాఠీచార్జ్‌ (Video)

తాడిప‌త్రిలో టీడీపీ నేత‌ల ఫైటింగ్‌.. లాఠీచార్జ్‌

అనంతపురం (Anantapur) జిల్లా తాడిపత్రి (Tadipatri)లో ఆదివారం సాయంత్రం వినాయక (Vinayaka) నిమజ్జన (Immersion) కార్యక్రమం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక టీడీపీ (Local TDP) నేతల మధ్య ఆధిపత్య పోరు రగిలి, పరిస్థితి నియంత్రణ తప్పింది. వివరాల్లోకి వెళ్తే, మాజీ ఎమ్మెల్యే, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అనుచరులు, టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ (Kakarla Ranganath) అనుచరుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. అలాగే, పలు వాహనాలు ధ్వంసం కాగా, ఊరేగింపులో వాడిన డీజే బాక్స్‌లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి.

ఇరువ‌ర్గాల వినాయ‌క ప్ర‌తిమ‌లు ఎదురుప‌డ‌గా, ఆధిప‌త్య పోరుతో జరిగిన ఘటనతో గణేష్ నిమజ్జనం చూడటానికి వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు భయాందోళనలకు గురై ఇళ్లకు పరుగులు తీశారు. పట్టణం కొంతసేపు అల్లకల్లోలంగా మారింది. పరిస్థితి అదుపు తప్పుతుందని గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, లాఠీచార్జ్ (Lathi-Charge) చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఇంకా భ‌యాన‌కంగానే ఉన్న‌ట్లుగా స‌మాచారం. అధికార పార్టీ నేత‌లు బ‌రితెగించి త‌ప్ప‌తాగి కొట్టుకున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment