ఆ 20 మంది మ‌ర‌ణానికి ‘కూట‌మి క‌ల్తీ మ‌ద్య‌మే కార‌ణం’

ఆ 20 మంది మ‌ర‌ణానికి 'కూట‌మి క‌ల్తీ మ‌ద్య‌మే కార‌ణం'

కర్నూలు (Kurnool) జిల్లా బస్సు ప్రమాదం (Bus Accident) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వైసీపీ(YSRCP) జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి (S.V Mohan Reddy) ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ విషాదానికి కూటమి ప్రభుత్వం (Coalition Government) పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కూట‌మి క‌ల్తీ మ‌ద్యం (Spurious Liquor) కార‌ణంగానే బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింద‌ని, “జాతీయ రహదారుల పక్కనే మద్యం దుకాణాలు నడపడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది” అని ఆరోపించారు.

ఏపీ ‘మద్యాంధ్ర ప్రదేశ్’గా మారింది
ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ “బ‌స్సు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన బైక‌ర్స్ శివ‌శంక‌ర్‌ (Shivashankar), ఎర్రిస్వామిలు (Erriswamulu) లక్ష్మీపురం (Lakshmipuram) వద్ద బెల్ట్ షాపు (Belt Shop)లో మద్యం (Liquor) కొనుగోలు చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు తిరునాళ్లలా అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్వయంగా నకిలీ మద్యం తయారు చేసి, అదే మద్యం ప్రజలకు అమ్ముతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ‘అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్’ (Annapurna Andhra Pradesh) నుంచి ‘మద్యంధ్ర ప్రదేశ్’ (Madyandra Pradesh)గా మారిపోయింది” అని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబుకు క్షమాపణ డిమాండ్‌
“బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి పేరుని కూడా కేసులో చేర్చాలి. బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం విక్రయించడంతో కనీసం 20 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితులు సృష్టించినందుకు సీఎం(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరాలి” అని అన్నారు. అలాగే, మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

“ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం అని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అయినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. లిక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నారు, ఇవి రాష్ట్ర ప్రజలకు ప్రమాదకరమయ్యాయి” అని హెచ్చరించారు. “ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం కథలు చెప్పడం మానేయాలి. బాధ్యత తప్పించుకునే విధానానికి స్వస్తి చెప్పాలి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment