కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే తన 12 నెలల పసిపాప (Infant Baby) పాలిట యముడిలా మారాడు. మద్యం మత్తు (Alcohol Intoxication)లో భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి లోనై, అభం శుభం తెలియని ఆ చిన్నారిని కాళ్లు పట్టుకుని నేలకు కొట్టాడు. ఈ క్రూరమైన చర్యతో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ కన్నుమూసింది. సూర్యాపేట (Suryapet) జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ పాపను కోల్పోయిన ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆ కసాయి తండ్రి (Butcher Father)ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







