---Advertisement---

20 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా సూర్య, త్రిష!

20 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా సూర్య, త్రిష!
---Advertisement---

తమిళ స్టార్ హీరో సూర్య 45వ చిత్రానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వ‌చ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో వేగంగా సాగుతోందట‌. చిత్ర నిర్మాతలు ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశార‌ట‌. ఇదివరకే ఇరువురూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, సూర్య-త్రిష జంటగా కనిపించడం దాదాపు 20 ఏళ్ల తర్వాత జరుగుతోంది.

లాయర్ పాత్రల్లో సూర్య, త్రిష
ఈ చిత్రంలో సూర్య, త్రిష న్యాయ‌వాదుల పాత్రల్లో కనిపించనున్నారు. ఇది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర బృందం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు. కానీ, కోలీవుడ్‌లో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment