సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

సూర్య 'కరుప్పు' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ క్రమంలో ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ (Karuppu) అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఇప్పటికే పోస్టర్‌ను విడుదల చేశారు. కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) ఈ సూర్య 45వ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సూర్య ఈ సినిమాతో గ్యారెంటీ హిట్ కొడతానని చాలా నమ్మకంతో ఉన్నాడు. అలాగే, దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా సూర్య అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘కరుప్పు’ టీజర్‌ (Teaser)ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ పుట్టినరోజుతో సూర్య 50 ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్నాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా త్రిష నటిస్తుందని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సూర్య పుట్టినరోజు కానుకగా ‘కరుప్పు’ సినిమాతో పాటు, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా ఉండే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment