తమిళ స్టార్ హీరో సూర్య (Surya)కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, గత కొంతకాలంగా సరైన హిట్ లేక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో, తన తదుపరి చిత్రం ‘కరుప్పు’ (‘Karuppu)తో సక్సెస్ సాధించాలని భావించి, సంక్రాంతి సీజన్ (Sankranthi Season)లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఇప్పుడు ఈ ప్లాన్‌కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా కోలీవుడ్‌లో భారీ పోటీ నెలకొనబోతోంది. ఇప్పటికే విజయ్(Vijay)) నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) జనవరి 9న విడుదల కానుంది. అలాగే, శివకార్తికేయన్ (Shiva Karthikeyan) చిత్రం ‘పరాశక్తి’ (‘Parashakti) కూడా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ పరిస్థితుల్లో ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటంతో, ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని సూర్య బృందం భావిస్తోంది. గత ఫ్లాపుల నేపథ్యంలో ఈ రిస్క్ తీసుకోవడం సరైనది కాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే, సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుని, వేసవిలో సినిమాను విడుదల చేయాలని ‘కరుప్పు’ టీమ్ ఆలోచిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.