సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విషాదం నెలకొంది. కమ్యూనిస్టు (Communist) ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన సీపీఐ(CPI) సీనియర్ నాయకుడు (Senior Leader), మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) శుక్ర‌వారం రాత్రి హైదరాబాద్‌ (Hyderabad) లో తుదిశ్వాస విడిచారు. గ‌త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో కమ్యూనిస్టు వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది.

1942 మార్చి 25న మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కోన్రావుపల్లి (Konravupalli)లో జన్మించిన సుధాకర్ రెడ్డి, విద్యార్థి నాయకత్వం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా అవతరించారు. అనంతరం సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా, రెండు సార్లు ఎంపీగా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, చివరగా 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆయన వాగ్దాటి, పోరాటపంథా, వాదన శక్తి ఆయన్ని ప్రత్యేక నాయకుడిగా నిలిపాయి.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమం వంటి అనేక ప్రజా పోరాటాలకు ఆయన అగ్రగామిగా నిలిచారు. గాయపడ్డా వెనక్కి తగ్గని ధైర్యం ఆయన ప్రత్యేకత. అంతర్జాతీయ వేదికలపై కూడా భారత పార్లమెంట్ తరపున తన వాదన వినిపించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన భౌతికకాయాన్ని మగ్ధూంభవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం గాంధీ బోధానాసుపత్రికి వైద్య పరిశోధన కోసం అప్పగించనున్నారు. ఆయన సేవలు దేశ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment