పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టు కీలక విచారణ

పార్టీ ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టు ముందుకు..

నేడు సుప్రీంకోర్టులో (Supreme Court) తెలంగాణ (Telangana) పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (MLAs) కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా (Justice Dipankar Datta), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో (Justice Augustine George Masih) కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పరిశీలించనుంది. ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ, అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత విచారణలో స్పీకర్ నాలుగు వారాల్లో కోర్టు ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు అందాయి.

తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందని కేటీఆర్(KTR) కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. “మీరు నిర్ణయం తీసుకుంటారా? లేక మేమే తీసుకోవాలా?” అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేటి విచారణలో ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment