లిక్కర్ కేసు (Liquor Case) లో వైసీపీ (YSRCP) ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (Peddireddy Mithun Reddy) కి సుప్రీం కోర్టు (Supreme Court) లో ఊరట (Relief) దక్కింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్దివాల (Justice Pardiwala) సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లోని ఉద్రిక్తత వాతావరణం ఈ కేసులో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అరెస్టు ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. మద్యం కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తునకు మిథున్ రెడ్డి హాజరయ్యారని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఎంపీ తరఫు న్యాయవాదులు అభిషేక్ సింగ్వి (Abhishek Singhvi), నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తెలిపారు.
మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ (AP CID) అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది. కౌంటర్‌ను పరిశీలించి రిజైన్డర్ దాఖలు చేసేందుకు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు గౌరవ కోర్టును సమయం కోరారు. రెండు వారాల వరకు సమయం ఇస్తూ కేసు వాయిదా వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాల, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం ప్రకటించింది. మద్యం విధానం కేసులో తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్టు (Arrest) చేయవద్దని ఇదివరకే ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఆ దేశాలు కొనసాగుతాయని ప్రకటించింది.