సుప్రీం కోర్టులో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులో కోర్టు జోక్యం అవసరం లేదని భావిస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది.
ఫార్ములా-ఈ రేస్ పై వివాదం
ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని దాన కిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేర్చారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఏసీబీ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై అసంతృప్తితో సుప్రీం కోర్టుకు వెళ్లిన కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. మరి కోర్టు తీర్పుపై కేటీఆర్ ఎలా స్పందించి కేసులో ముందడుగు వేస్తారో వేచి చూడాలి.