హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ఎదురుదెబ్బ (Setback) తగిలింది. HCU ఆవరణలో ప్రభుత్వం చెట్లను (Trees) నరికేస్తోందని పిటిషన్ (Petition) దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ జరిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరగా, సుప్రీంకోర్టు (Supreme Court) ఈ పిటిషన్‌ను స్వీకరించింది. విచారణ అనంతరం హెచ్‌సీయూ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది.
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ అనంతరం భూముల్లో అన్ని రకాల పనులు నిలిపివేయాలని ఆదేశించింది. పర్యావరణ విధ్వంసంపై సుప్రీం సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారని జస్టిస్ బిఆర్ గవాయి (B.R. Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ సెక్రటరీ (Chief Secretary), జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఏం చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని దానిలో కమర్షియల్ లేఅవుట్లు వేసి విక్రయించాలని తెలంగాణలోని రేవంత్ సర్కార్ ప్లాన్ వేసింది. విద్యార్థులు, బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, జేసీబీ (JCB)లతో హెచ్‌సీయూలోని భూమిని చదును చేసే పనులను ప్రభుత్వం ప్రారంభించింది. చెట్లను నరుకుతున్నారని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు సైతం ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించింది.








