ముదిరిన ఫోన్ ట్యాపింగ్ కేసు

ముదిరిన ఫోన్ ట్యాపింగ్ కేసు

తెలంగాణ (Telangana)లో పెద్ద వివాదానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) వెంటనే సిట్ (SIT) ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు, తాజా విచారణలో ఆ రక్షణను తొలగిస్తూ, కస్టడీలో విచారణ అవసరమని అభిప్రాయపడింది. విచారణకు సహకరించడం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలను కోర్టు సమర్థించింది.

డివైస్ డేటా ధ్వంసం అంశంపై కోర్టు ఆందోళన
విచారణలో ప్రధానంగా డివైస్‌లలో (Devices) డేటా డిలీట్ (Data Deleted) కావడం, మొత్తం 36 డివైజ్‌లు పూర్తిగా ధ్వంసమై ఉండటం వంటి విషయాలను ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ప్రభాకర్ రావు ఉపయోగించిన డివైస్‌ల పాస్‌వర్డ్‌లు రీసెట్ చేసినప్పటికీ, ఐ-క్లౌడ్ (iCloud) లేదా ఇతర స్టోరేజ్‌లో ఎటువంటి డేటా లభించలేదని విచారణ అధికారులు తెలిపారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, కేసును లోతుగా పరిశీలించాలంటే కస్టడీ విచారణ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

విచారణ కొనసాగింపు మరియు సుప్రీంకోర్టు సూచనలు
ప్రభాకర్ రావు తరపు న్యాయవాది రంజిత్ కుమార్ (Ranjit Kumar), తమ క్లయింట్ విచారణకు సహకరిస్తున్నారని, పై అధికారుల ఆదేశాల మేరకు కొంత డేటా తొలగించాల్సి వచ్చిందని వాదించారు. ఆయన సీనియర్ సిటిజన్ కావడంతో విచారణ సమయంలో గౌరవాన్ని కాపాడాలని, ఎటువంటి శారీరక హింసకు గురిచేయకూడదని సిట్‌కు సుప్రీంకోర్టు సూచించింది. కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని, వచ్చే శుక్రవారం తదుపరి హియరింగ్ జరిగేలా కోర్టు నిర్ణయించింది. అప్పుడు వరకు సిట్ మరియు తెలంగాణ ప్రభుత్వం తాజా స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment