‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

సాక్షి ప్రసారాల నిలిపివేత.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సాక్షి టీవీ (Sakshi TV) ప్రసారాలను (Broadcasts) అక్రమంగా (Illegally) నిలిపివేసిన (Stopped) ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) ఏపీ ప్రభుత్వానికి (AP Government నోటీసులు (Notices) జారీ చేసింది. ప్ర‌సారాలు ఎందుకు నిలిపివేశారో మూడు రోజుల్లో స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించింది. సాక్షి ప్ర‌సారాల నిలిపివేత కేసులో జస్టిస్ (Justice) పీఎస్ నరసింహ (PS Narasimha), జస్టిస్ (Justice) ఎఎస్ చందూర్కర్‌ (AS Chandurkar)లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వంతో పాటు ఏపీ ఫైబర్ నెట్‌ (AP Fiber Net)తో సహా పలు మల్టీ-సిస్టమ్ ఆపరేటర్లకు (ఎంఎస్వోలు) (MSOs) నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సాక్షి టీవీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌లో, ఏపీలో కూటమి ప్రభుత్వం కేబుల్ టీవీ నిబంధనలను ఉల్లంఘించి, ప్రసారాలను అడ్డుకుంటోందని ఆరోపించింది.

ఈ ఘటన గత జూన్ నెలలో సాక్షి టీవీతో పాటు మరో మూడు ఛానెళ్ల ప్రసారాలను ఏపీలోని కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడంతో మొదలైంది. ఈ చర్య టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనలకు విరుద్ధమని, మీడియా స్వేచ్ఛను హరించే చర్యగా ఉందని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (NBDA) ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షి టీవీ యాజమాన్యం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, ఈ నిలిపివేత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింది వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ కేసు రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ, రాజకీయ ఒత్తిళ్లపై కీలక చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment