ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎదుర్కొంటున్న వరుస ఓటములపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “SRH బ్యాటింగ్ లైనప్ (Batting Lineup) లో ఎలాంటి లోపం కనిపించడంలేదు. కానీ, బౌలింగ్ (Bowling) విభాగంలో సరైన లైనప్ లేకపోవడం వల్లే వారు విజయాలను అందుకోలేకపోతున్నారు” అని రాయుడు పేర్కొన్నారు.
ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టగల బౌలర్లు లేరని అన్నారు. “ఈ క్రిటికల్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్లు లేకపోవడం వారి ఓటములకు కీలక కారణం. ఇది వెంటనే పరిష్కరించకపోతే, రానున్న మ్యాచ్‌లలోనూ అదే పరిస్థితి మళ్లీ కనిపించనుంది” అని స్పష్టం చేశారు.