2025 ఐపీఎల్ (IPL) సీజన్‌ను భారీ అంచనాలతో మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ (Playoffs) ఆశల్ని కోల్పోయే పరిస్థితికి చేరింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు సాధించిన SRH, 6 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
తాజాగా సోమవారం సొంతగడ్డ అయిన ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన అవసరం SRHకి ఎంతో కీలకం. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవగలిగితేనేగానీ, ప్లేఆఫ్ బెర్తుకు ఆశలు మాత్రం మిగులుతాయి. అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా, ఇది కష్టమైన లక్ష్యమేనన్నది అభిమానుల అంచనా.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో గెలిస్తే, ఆశలు అయినా సజీవంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. అదే గెలుపు దూరమైతే, ఈ సీజన్‌కి ముగింపు లాంఛనంగా మారే ప్రమాదం ఉంది. SRHకు ఈ మ్యాచ్ గెలుపు, ఓటములే కీలక అడుగుకు దారి తీసే సూచనలు ఉన్నాయి. ఎలాగైనా ఢిల్లీపై విజయం సాధించాలని SRH అభిమానులు కోరుకుంటున్నారు.