Sunita Williams : 9 నెలల నిరీక్ష‌ణ‌.. భూమిపై అడుగు

9 నెలల నిరీక్ష‌ణ‌.. భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

నాసా ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం అనంతరం భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టింది. దాదాపు 9 నెలల తర్వాత తిరిగి వచ్చిన ఆమె, క్యాప్సూల్ నుంచి వెలువడే క్షణంలో చిరునవ్వులు చిందిస్తూ అందరికీ హాయ్ చెప్పింది. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాంకేతిక సమస్యలతో ఆలస్యం
సునీతా విలియమ్స్ గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లింది. వారంలోనే తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు 9 నెలల పాటు కక్ష్యలోనే గడిపింది. ఎట్టకేలకు భూమికి విజయవంతంగా తిరిగొచ్చిన ఆమెకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలందరూ సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment