సుకుమార్ సెంటిమెంట్ ఫార్ములా: ఎమోషన్‌తో కూడిన యాక్షన్!

సుకుమార్ సెంటిమెంట్ ఫార్ములా: ఎమోషన్‌తో కూడిన యాక్షన్!

దర్శకుడు సుకుమార్ ఒక కథను ఎమోషన్‌కు యాక్షన్‌ను జోడించి చెప్పడంలో సిద్ధహస్తుడు. ఆయన ప్రతి సినిమాలో ఒక బలమైన ఎమోషన్‌ను హైలైట్ చేస్తుంటారు. హీరో పాత్రకు దాన్ని అనుసంధానించి, అతని యాక్షన్‌కు ఒక ప్రత్యేక అర్థాన్ని చూపిస్తారు. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి సినిమాలు చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది.

సుకుమార్ సినిమాల్లో హీరోకు ముందుగా ఏదో ఒక అవమానం జరగడమో, లేదా తన జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం విలన్లతో పోరాడటమో కనిపిస్తుంది. అతను హీరోను మొదట ఒక బాధితుడిగా చూపిస్తాడు. అప్పుడు ఆ హీరో విలన్లతో చేసే ఫైట్లు ప్రేక్షకులకు మరింత సంతృప్తినిస్తాయి, బోర్ కొట్టవు. హీరో గెలిస్తే ప్రేక్షకులు తాము గెలిచినట్టు భావిస్తారు.

సుకుమార్ లెక్కలను అనుసరిస్తున్న ఇతర దర్శకులు
ఇప్పుడు చాలా మంది దర్శకులు ఈ ఎమోషనల్ ఫార్ములాను అనుసరిస్తున్నారు.

బుచ్చిబాబు రామ్ చరణ్‌తో తీస్తున్న ‘పెద్ది’ సినిమాలో కూడా ఇదే రకమైన ఎమోషన్‌ను చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

అలాగే, నానితో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ కూడా అదే బాటలో రాబోతోందట.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నమూరి దర్శకత్వంలో వస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమాలో అన్నదమ్ముల అనుబంధంతో కూడిన ఎమోషన్‌ను చూపించనున్నారు.

ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాలో ఇలాంటి ఎమోషన్లను చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న మూవీలో కూడా అలాంటి ఎమోషన్‌ను హైలైట్ చేస్తున్నాడట.

హీరోకు ఒక ఎమోషన్ లేదా సెంటిమెంట్‌ను కనెక్ట్ చేస్తే ప్రేక్షకులు ఆ మూడ్‌లోకి వెళ్లి సినిమాకు సులభంగా కనెక్ట్ అవుతారు. ఈ లెక్కలు సుకుమార్‌కు బాగా తెలుసు. ఆ లెక్కలు విజయవంతం అవుతుండటంతో, మిగతా దర్శకులు కూడా హీరోల పాత్రలకు ఎమోషన్/సెంటిమెంట్‌ను జోడించేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment