సినిమా షూటింగ్ (Cinema Shooting)లో ఘోర ప్రమాదం (Terrible Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎం. రాజు, ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా 2021లో విడుదలైన ‘సర్పట్ట పరంబరై’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో స్టంట్ మాస్టర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం నాగపట్టినం జిల్లాలోని విళుందమవాడి వద్ద జరిగింది.
స్టంట్ మాస్టర్ రాజు కారు టాప్లింగ్ స్టంట్ సన్నివేశాన్ని నిర్వహిస్తుండగా ఊహించని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతిచెందారు. రాజు తమిళ సినిమా పరిశ్రమలో ధైర్యసాహసాలకు పేరుగాంచిన స్టంట్ మాస్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఆయన అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో హై-రిస్క్ యాక్షన్ సన్నివేశాలను నిర్వహించారు. ఆయన నైపుణ్యం, అంకితభావం తమిళ చిత్ర పరిశ్రమలో అందరి ప్రశంసలు అందుకున్నాయి.
ప్రముఖ స్టంట్ మాస్టర్ (Stunt Master) మృతి (Death)పై తమిళ ఇండస్ట్రీ అంతా సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై హీరో ఆర్య, దర్శకుడు పా. రంజిత్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఈ ప్రమాదం సినీ పరిశ్రమలో హై-రిస్క్ స్టంట్ సన్నివేశాల సమయంలో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది.