---Advertisement---

గురుకులంలో ఎలుకల దాడి.. పది మంది విద్యార్థులకు గాయాలు

---Advertisement---

ముమ్మిడివరం (Mummidivaram) మండలంలోని ఠాణేలంక (Thaneylanka)లో ఉన్న సాంఘిక సంక్షేమ (Social Welfare) గురుకుల పాఠశాల (Gurukula School) లో ప్రమాదకర పరిస్థితులు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చాయి. కాలం చెల్లిన స‌రుకులు, ఎలుక‌లు (Rats), పాముల సంచారం విద్యార్థుల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుండ‌గా, తాజాగా ఆహార భ‌ద్ర‌తాధికారుల త‌నిఖీతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

బుధవారం ఆహార భద్రత అధికారులు ఠాణేలంక‌లోని గురుకుల పాఠ‌శాల‌ను ప‌రిశీలించారు. తనిఖీల సమయంలో విద్యార్థులు (Students) ఎలుకల దాడికి (Rat Attacks) గురవుతున్న విషయం బ‌య‌ట‌ప‌డింది. పాఠశాల డార్మెటరీ (School Dormitory) చుట్టూ పొదలు (Bushes) పెరిగిపోవ‌డంతో ఎలుకలు, పాములకు నివాసంగా ఏర్ప‌డి ప్రమాద‌క‌రంగా మారింది. ఇటీవల ఎలుకలు వసతి గృహాల్లోకి చొరబడి ప‌ది మంది విద్యార్థుల‌ను గాయ‌ప‌రిచాయి. ఎలుక‌ల దాడిలో గాయ‌ప‌డిన విద్యార్థులకు ఆరోగ్య శాఖ అధికారిణి డా. శ్రీపూజ (Dr. Sripooja) చికిత్స అందించిన విష‌యం అధికారుల త‌నిఖీల‌తో వెలుగులోకి వ‌చ్చింది.

ఇక పరిశుభ్రత లేకపోవడం (Lack of Hygiene) వల్ల కొంతమంది విద్యార్థులు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. వారిని చర్మ వ్యాధి నిపుణుల ద్వారా పరీక్షించాల్సిందిగా సూచించారు. పాఠశాలలో ఇంకా కాలం చెల్లిన రాగిపిండి ప్యాకెట్లు, పురుగులు పట్టిన ఇతర సరకులు కూడా అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ ఘటన విద్యా సంస్థల నిర్వహణ లోపాన్ని, అధికారుల నిర్లక్ష్యం, పాఠశాల నిర్వహణలో దౌర్భాగ్య స్థితిని ఇది మరోసారి వెలుగులోకి తెచ్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment