రంజీ మ్యాచ్‌లో కోహ్లీ.. ఢిల్లీ స్టేడియంలో తొక్కిసలాట

రంజీ మ్యాచ్‌లో కోహ్లీ.. ఢిల్లీ స్టేడియంలో తొక్కిసలాట

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రంజీ మ్యాచ్ జ‌రుగుతుంది. రైల్వే జ‌ట్టుతో ఢిల్లీ జ‌ట్టు త‌ల‌బ‌డుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్‌కు కోహ్లీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడ‌ని తెలుసుకున్న ఫ్యాన్స్ ఒక్క‌సారిగా స్టేడియం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అభిమానుల‌తో మైదాన ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది. అయితే, గేటు నంబర్ 16 వద్ద గుమిగూడిన అభిమానులు ఆందోళన రేపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అంతేకాదు, ఒక పోలీస్ బైక్ ధ్వంసమైంది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు కూడా లేనంత క్రేజ్ ఈ రంజీ మ్యాచ్‌కు రావడం విశేషం. మైదానంలోకి ప్ర‌వేశించిన ఓ ఫ్యాన్ కోహ్లీ కాళ్లు మొక్కాడు.

కోహ్లి కోసం అభిమానులు ఊహించని స్థాయిలో హాజరయ్యారని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment