హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), డైరెక్టర్ కార్తీక్ రాజు (Karthik Raju) కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగిల్’ (Single) ప్రస్తుతం యువతలో ఆసక్తిని రేపుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్, విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇవానా మరియు కేతిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సమ్మర్‌లో స్పెషల్ మూవీగా మే నెలలో థియేటర్లలోకి రానుంది. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ (Vennela Kishore) కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా విడుదలైన “సిర్రాకైంది సింగిల్ బతుకు (Sirra Kaindi Single Bathuku)” పాట (Song) ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ పాటకు ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌లో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ బీర్ బాటిల్స్ పట్టుకుని, మధ్యలో ఒక లేడీ బొమ్మను చూస్తూ ఫ్రస్ట్రేషన్ (Frustration) చూపిస్తూ కనిపించారు.
“బాధ, కోపం, ఈర్ష్య, కసి, ద్వేషం మన సింగిల్ కష్టాలు ఇంకెన్నెన్నో.. అలాంటి సింగిల్స్ కోసం ఫ్రస్టేషన్ ఆంతమ్” అంటూ ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట వాస్తవంగా సింగిల్స్ జీవితం ఎదుర్కొంటున్న భావోద్వేగాలను వినోదాత్మకంగా ఆవిష్కరించింది.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య