మొన్న బొద్దింక‌, నేడు జెర్రీ.. పేద‌ విద్యార్థుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం

మొన్న బొద్దింక‌, నేడు జెర్రీ.. పేద‌ విద్యార్థుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం

ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో (Government Hostels) విద్యార్థులకు (Students) అందించే భోజ‌నం (Food)లో కీట‌కాల ద‌ర్శ‌నం సంచ‌ల‌నంగా మారింది. అన‌కాప‌ల్లి (Anakapalli)లో హోంమంత్రి (Home Minister)కి వ‌డ్డించిన భోజ‌నం (Food)లో బొద్దింక (Cockroach) సంఘ‌ట‌న మ‌రిచిపోక‌ముందే శ్రీ‌కాళ‌హ‌స్తి బాలికల‌ హాస్ట‌ల్‌ (Srikalahasti Girls Hostel)లో జెర్రి (Centipede) ప‌డిన టిఫిన్ తిని ముగ్గురు అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌రుసగా ప్ర‌భుత్వ హాస్ట‌ల్స్‌లో జ‌రుగుతున్న ఉదంతాలు విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. విద్యాశాఖ‌లో నిర్ల‌క్ష్యానికి అద్దం ప‌డుతున్నాయి.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో గురువారం ఉదయం టిఫిన్‌గా వడ్డించిన ఉప్మాలో జెర్రీ క‌నిపించింది. ఆ టిఫిన్ తిన్న ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో హాస్టల్‌లోని ఇతర విద్యార్థినులు అప్రమత్తమై, ఆహారం తినకుండా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినులను వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ ఘటన రెండు వారాల క్రితం అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్‌లో జరిగిన సంఘటనను గుర్తు చేస్తోంది. అక్కడ హోం మంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. ఇప్పుడు శ్రీకాళహస్తిలో మరోసారి ఆహారంలో పురుగులు కనిపించడంతో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలోని శాఖలో ఈ నిర్లక్ష్యం కొనసాగుతోందని, విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment